ఎర్రన్నాయుడి మృతికి సంతాపం

మిరుదోడ్డి : తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి మృతి పట్ల భాజపా రాష్ట్ర కౌన్సిలర్‌ సుకూరు లింగం, తెలుగు యువత నాయకుడు టి. శ్రీనివాసులు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపం తెలిపారు. తెదేపాకు ఎర్రన్నాయుడు లేని లోటును తీర్చలేమని, ఆయన పార్టీకి ఎనలేని సేవలందించారని శ్రీనివాసులు కోనియాడారు.