ఎర్రవెల్లి యాగశాలలలో మంటలు…

99మెదక్ : ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అయిత చండీయాగంలో చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది. యాగ శాలలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాగ విరామం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటపంపై పై భాగంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనితో రుత్విక్కులు బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. భక్తులు ఎలాంటి భయాందోళనలకు చెందవద్దని నిర్వాహకులు పేర్కొన్నారు.

భారీగా పొగ..
101 హోమ గుండాలతో యాగశాల మొత్తం పొగ చూరుకపోయింది. దీనితో ఊపిరి ఆడకపోవడం..కళ్లు మంటలు చెలరేగడంతో రుత్విక్కులు బయటకు వెళ్లిపోయారు. దీనితో చండీయాగానికి స్వల్ప ఆటంకం ఎదురైంది. ఆ వెంటనే రుత్విక్కులను యాగశాల బయటకు వెళ్లనీయవద్దని నిర్వాహకులు మైక్ లో సూచనలు చేశారు. లోపలకు రావాలని..అరగంటలో హోమం పూర్తవుతుందని రుత్విక్కులకు నిర్వాహకులు సూచించారు. కానీ యాగశాల లోనికి వెళ్లేందుకు రుత్విక్కులు సాహసించలేదు. పొగ మొత్తం బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మైక్ లో మంత్రి హరీష్ రావు పలు సూచనలు చేశారు. చివరకు యాగం తిరిగి మొదలైంది.

తాజావార్తలు