ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా మాకు ఆందోళన లేదు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్
ఢిల్లీ: ఎఫ్‌ఐలపై ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్‌నాథ్ పేర్కొన్నారు. ఓటింగ్‌తో కూడిన చర్చపై తమకు ఆందోళన లేదన్నారు. ఏ నిబంధన కిందైనా ఈ అంశంపై చర్చ జరగాలని అఖిలపక్షంలో అభిప్రాయం వ్యక్తమైందని ఆయన తెలిపారు. ఏ నిబంధన కింద చర్చకు అనుమతించాలో సీకర్ నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.