ఎలిగేడులో బంద్‌ సంపూర్ణం

ఎలిగేడు: విద్యుత్‌ సమస్యపై విపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌ మంగళవారం ఎలిగేడులో సంపూర్ణంగా ముగిసింది. ఈ బంద్‌లో వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సీపీఐ , భాజపా , తెదేపా ,వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎలిగేడు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, భాజపా మండల అధ్యక్షుడు నారాయణస్వామి, సీపీఐ మండల కార్యదర్శి అర్కటి రాజయ్య, వైకాపా మండల అధ్యక్షుడు వేణుమా ధవరావు తదితరులు పాల్గొన్నారు.