*ఎలుగుబంటి దాడిలో పసుల కాపరికి తీవ్రగాయలు

*ఎలుగుబంటి దాడిలో పసుల కాపరికి తీవ్రగాయలు
* రాములను కాపాడిన పశువులు!
_________
లింగంపేట్ 09 ఆగస్టు (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన తలారి రాములు అనే వ్యక్తి పై మంగళవారం ఎలుగు బంటి దాడి చేయడంతో తీవ్రగాయలు అయినయని గ్రామస్తులు తెలిపారు.వివరాలు ఈ విధంగా ఉన్నాయి గ్రామానికి చెందిన తలారి రాములు 42 అనే పసుల కాపరి ప్రతిరోజు లాగనే గేదులు మేపడానికి ఊరి పొలిమేరలో పశువులను మేపి తిరుగు ప్రయణంలో ఊరి పొలాల ప్రక్కన రాగానే ఒకేసారి ఎలుగు బంటి రాములు పై దాడి చేసి తీవ్రగాయాలు చేసి తల పై శర్మం తీనేస్తుండగా ఎలుగుబంటి పై గేదలు ఎదురుదాడి చేయడంతో ఎలుగు బంటి రాములును వదిలేసి పారిపోయిందని అన్నారు.అతని గమనించిన చుట్టు పక్కల పొలం వారు అంబులెన్స్ కు ఫోన్ చేసి అతనిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారన్నారు.