ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద లారీ బీభత్సం:ఒకరి మృతి

హైదరాబాద్ : అదుపు తప్పిన ఓ లారీ ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులపైకి దూసుకుపోవటంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మనవరాలిని కాలేజీలో చేర్పించడానికి స్కూటీపై వెళ్తున్న లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.