ఎవరితోనూ పొత్తులుండవు
బెంగుళూరు : కర్ణాటక విధానసభకు జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇకపై భాజపా నేతలతో అనవసరంగా మాట్లాడబోనని ఆయన తెలిపారు. డిసెంబర& 9న కర్ణాటక జనతాపార్టీ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 224 విధానసభ స్థానాల్లోనూ తమ కేజేపీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని చెప్పారు.