ఎవరి సంసృతి వారికి గొప్ప
నారాయణగూడ: ఫలానా వారిదే గొప్ప సంస్కృతి అని చెప్పడానికి వీలు లేదు, ఎవరి సంస్కృతి వారికి గొప్పదని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డొమాణిక్యవరప్రసాద్ అన్నారు. మనిషిని మనిషిగా గౌరవించని సంస్కృతి సంస్కృతే కాదన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సర్వస్వ కేంద్రం మైసూర్‌లోని సీఐఐఎల్ సహకారంతో వర్శిటీలో ‘భారతీయ సాహిత్యం-దళిత సంస్కృతి’ అనే అంశంపై ఏర్పాటు చేసిన 3రోజుల జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు.