ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీరు విడుదల
నిర్మల్: సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్నారు. ఈరోజు ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీటిని ఆయన విడుదల చేశారు. వారం రోజులపాటు ప్రతి నిత్యం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతారని ఆయన తెలిపారు. నిర్మల్, లక్ష్మణచాంద, మామడ మండలాల రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణచాంద మాజీ ఎంపీపీ సరికెల గంగన్న , నీటి సంఘం అధ్యక్షుడు మెయినుద్దీన్, ఎస్సారెస్పీ అధికారులు పాల్గొన్నారు.



