ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం
ఖమ్మం,జనవరి23(జనంసాక్షి): ఉపాధి హామి పథకం క్రింద ఎస్సీ, ఎస్టీలు నివాసిత ప్రాంతాల్లోఎ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని మంత్రి తుమ్మలఅన్నారు. ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో సీసీ రోడ్ల
నిర్మాణానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని తెలిపారు. ఈపనుల నిర్వహణకమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్ గా పంచాయితీరాజ్ ఎస్‌ఈ, ఐటీడీఎ పిఓ, డీపీఓ,జడ్పీ సీఈఓ, డ్వామా పిడిలు సబ్యులుగా ఉంటారన్నారు. ఈకమిటీ పరిశీలించిన పనులకు మంజూరు చేయడం జరుగుతందన్నారు. గ్రామ పంచాయితీకి సీసీ రోడ్లు మంజూరు చేసందకు ఆ పంచాయితీ పరిధిలో చేపట్టిన ఉపాధి హామి పనులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, హరితహారంలో మొక్కలు నాటుట బహిరంగ మల విసర్జన లేకుండా చేసిన గ్రామాల్లో మాత్రమే ఈ నిధులుకేటాయిస్తామన్నారు. అలాగే పంచాయితీ ద్వారా 30శాతం రోడ్ల నిర్మాణానికి నిధుల చెల్లింపులు చేసిన అనంతరం ఉపాధి హమి పథకం ద్వారి మిగిలిన నిధులు మంజూరు చేయడం జరగుతుందన్నారు. గ్రామ పంచాయితీల నుంచి రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన ప్రతిపానదలను పరిశీలనను డీపీఓ, జడ్పీ సీఈఓలు ఎంపిక చేయాలన్నారు.