ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.
బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశానుసారం స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో పలు విద్యాలయాలలో, పలు కూడళ్ళులో, పలు చోట్ల పోలీసు వారిచే సైబర్ నేరాలపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మండల ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల గురించి, సైబర్ క్రైమ్ ఎవెరనెస్, వినాయక చవితి మండపాలు, ట్రాఫిక్ రూల్స్, పట్టణంలో జరుగుతున్న అక్రమాల పలు మోసాల గురించి ప్రజలకు అవగాహన కలిగించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ ఐ సంతోష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ పాపయ్య, కానిస్టేబుల్ సాగర్, హోంగార్డు లక్పతి, పాల్గొన్నారు.