ఎస్‌పీహెచ్‌ఓపై వేటు
జమ్మికుంట, జనంసాక్షి : జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలో రోగి మృతిచెంది ఐదు రోజులు గడిచినా పట్టించుకోని వైద్యుడిపై వేటుపడింది. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ చర్యలు చేపట్టారు. ఎస్‌పీహెచ్‌ఓ వైద్యుడు అంకూస్‌ను సెలవుల్లో వెళ్లాలని సోమవారం ఆదేశించారు. ఆస్పత్రి విధుల్లో నిర్లక్ష్యం వహించిన మిగతా డాక్టర్లు, సిబ్బందిపై నేడో, రేపో వేటు వేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. గత నెల 30న గుర్తు తెలియని వ్యక్తిని 108 సిబ్బంది ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రధమ చికిత్స అందించి జనరల్ వార్డుకు పంపించేశారని, వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సదరు వ్యక్తి మృతి చెందాడనే ఆరోపణలున్నాయి. కాగా, కుళ్ళిపోయిన మృతదేహన్ని గుర్తించి రోగులు సమాచారమందించడంతో వైద్య సిబ్బంది స్పందించారు. కాగా, ఈ విషాయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ జిల్లా టీబీ నివారణ అధికార రాజేశంను ఆదివారం విచారణకు ఆదేశించారు. రాజేశం వాచారణ జరిపి నివేదికను సోమవారం కలెక్టర్ అందించగా వెంటనే వైద్యుడు అంకూస్ సెలకుల్లో వెళ్లాలని ఆదేశించారు. మిగితా వైద్య సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.