ఎస్.ఎఫ్.ఐ పోరాటo పలించింది..!

భైంసారూరల్, జనం సాక్షి ఆగస్టు19

ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా కమిటీ తరపున అనేక సందర్భాల్లో ముధోల్ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాగా… ఎట్టకేలకు మా పోరాట ఫలితం ఫలించింది అని ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి వినతి పత్రం, అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించడం వంటి పోరాటాలు చేశామని తెలిపారు. డిగ్రీ కళాశాల ఒకటే సరిపోదు విద్యార్థులు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గం లో ఇంకా ఖాళీగా టీచర్ పోస్టులు ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని అన్నారు. 21వ తేదీన కలెక్టర్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల వెంటనే పునరాదన చేయాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ముట్టడి ఉంటుందని తెలిపారు. వీరి వెంట జిల్లా కమిటీ సభ్యులు ప్రతాప్ తదితరులు ఉన్నారు.