ఏఎంసీ కేసులో రెండో అనుబంధ అభియోగపత్రం దాఖలు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో రెండో అనుబంధ అబియోగ పత్రాన్ని నాంపల్లి కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో ఏడో నిందితునిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌పై  ఈ అభియోగ పత్రం దాఖలైంది. మొత్తం 2,975 పేజీలతో కూడిన 67 అనుబంధ దస్త్రాలను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. 36 మంది సాక్షుల వాంగ్మూలాలు ఇందులో జతపరిచారు.