ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయండి.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్.
పోటో: గోడ ప్రతులు విడుదల చేస్తున్న నాయకులు.
బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి)
ఈ నెల అక్టోబర్ 9న బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించే ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో గోడ ప్రతులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షు, ప్రధాన కార్యదర్శిలు మిట్టపల్లి వెంకట్ స్వామి, మేకల దాస్ మాట్లాడుతూ కార్పొరేట్ ఏజెంట్ బిజెపి నరేంద్ర మోడీ సంతులు సర్కుల్లాగా ప్రభుత్వ రంగ పరిశ్రమని దేశంలో కొద్దిమంది వ్యక్తుల ఆస్తులుగా మార్చిడానికి బిజెపి నరేంద్రడు ఉవ్విళ్లూరుతున్నారని, ఆయా రంగాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ప్రైవేటు భాగస్వాములు అయ్యే వారికి కార్మిక హక్కులు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, వేతనాల ఒప్పంద చట్టాలు లేకుండా మొత్తం కార్మిక చట్టాలే లేకుండా 44 కారంతో చట్టాలను నాలుగు లేబర్ కోడుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని బిజెపి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రిలయన్స్ అంబానీ ఆస్తులు పెరగడానికి భారత టెలికామ్ రంగాన్ని దివాలా తీసేసి 66 వేల మంది బిఎస్ఎన్ ఉద్యోగుల్ని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ పేరుతో ఇంటికి పంపించిన బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే అంతవరకు పోరాడాలని అన్నారు. మరోపక్క కెసిఆర్ అధికారంలోకి వచ్చాక అసంఘటితరంగా కార్మికుల పొట్టగొడుతూ ప్రభుత్వం కనీస వేతనాల కమిటీ ఏర్పాటు చేయకుండా నిరంకుశంగా వ్యవహరింస్తుందన్నారు. ఈనెల 9న జరిగే జిల్లా మహాసభలో పలు తీర్మానాలను ఆమోదం తెలుపుకొని మరిన్ని కార్మిక పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, చిప్ప నర్సయ్య, సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రేగుంట చంద్రశేఖర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి డి ఆర్ శ్రీధర్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు గుండ సోనియా, ఆహ్వాన కమిటీ సభ్యులు మరియు సిపిఐ, ఎఐటియుసి ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.