ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

ఈనెల 27 28 29 తేదీల్లో యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐటీయూసీ మూడో రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి కోరారు.శనివారం నేరేడుచర్ల లోని సిపిఐ కార్యాలయం ప్రజాభవన్లో మహాసభల గోడ పత్రికలు ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ.భారతదేశంలో వర్గ పోరాటాలకు ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని అలాంటి కార్మిక సంఘం నాయకత్వాన  దేశవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాల ఫలితంగా అనేక కార్మిక చట్టాలను సాధించుకున్నామని, కానీ ఈనాడు ఎన్డీఏప్రభుత్వం కార్మిక చట్టాల సవరణల పేరుతో సాధించుకున్న కార్మిక చట్టాలను కాల రాసి నాలుగు ప్రత్యేక కోడ్ ల ను తయారు చేసిందని  ప్రజల యొక్క నిత్య జీవిత అవసర వస్తువులపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వస్తువులపై జీఎస్టీ విధించి ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతుందన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌక గా అమ్మేందుకు రంగం సిద్ధం చేశారని ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగం,బ్యాంకులు,ఇన్సూరెన్స్, బొగ్గు,ఉక్కు పరిశ్రమలు  విమానయానం,రైల్వే,కోర్టులు పోస్ట్ ఆఫీసులు  ఆయిల్ కంపెనీలు ఓఎన్జిసి బీఏఈ ఇస్రోలాంటి అనేక సంస్థలను పరిశ్రమలను అదానీ అంబానీలకు అమ్మి వేసేందుకు రంగం సిద్ధం చేసిందని వారు ఆరోపించారు.27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు యాదగిరిగుట్ట లోని పాత హై స్కూల్ గ్రౌండ్ లో వేలాదిమంది కార్మికులతో ప్రదర్శన,,బహిరంగ సభ ఉంటుందని
 28, 29వ తేదీలలోజరిగే రాష్ట్ర ప్రతినిధుల మహాసభకు ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర జిత్ కౌర్ మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి ఎస్ బోస్ పాల్గొంటారని వారు తెలిపారు
 నేరేడుచర్ల ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
 గోడపత్రిక ఆవిష్కరణలో గీతా పరివారల సంఘం రాష్ట్ర నాయకులు పాలకూరి బాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, మండల అధ్యక్షుడు ఊదర వెంకన్న,ప్రధాన కార్యదర్శి అయిలా నాగేశ్వరరావు, రవి నాయక్,పర్సనబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు