ఏటీఎం కార్డు లేకుండా ఆధార్‌తో డబ్బులు విత్ డ్రా చేయొచ్చు.

ఏటీఎం కార్డ్ లేకుండానే కేవలం మీ ఆధార్ సహాయంతో మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం.. ముందుగా మీ ఆధార్ నంబర్‌కు బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. ఆ తరువాత, మీ దగ్గర్లోని మైక్రో ఏటీఎంలో మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఈ సిస్టమ్ ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేస్తుంది. ఆ తరువాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తిచేసి.. సులభంగా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.