ఏడు చోట్ల మినహా..సిట్టింగులే భారాస అభ్యర్థులు
` తొలిజాబితాలోనే 115 మంది అభ్యర్థుల ఖరారు
` ప్రకటించని నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్
` వాటికి కూడా త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామన్న గులాబీబాస్
` గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ
` కాంగ్రెస్ నుంచి వచ్చిన వారందరికీ టిక్కెట్లు
` ఆసిఫాబాద్‌లో మాత్రం ఆత్రం సక్కుకు నిరాశ
` కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్
` స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ
హైదరాబాద్(జనంసాక్షి): రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిఆర్‌ఎస్ జాబితాను పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ విడుదల చేశారు. స్వల్ప మార్పులతో జాబితాను సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో ప్రకటించారు. తాను రెండు స్థానాల్లో పోటీచేస్తున్నట్లుగా ప్రకటించారు. గజ్వెల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే ఛాన్స్ ఇచ్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. మజ్లిస్ తమ ఫ్రెండ్లీ పార్టీ అంటూనే, కమ్యూనిస్టులతో బంధాన్ని తెంచుకున్నారు. వారిని కేవలం మునుగోడు ఉప ఎన్నిక వరకే అన్న సంకేతాలు ఇచ్చారు. జాబితా ప్రకటించాక ఇక పొత్తు ఎక్కడిదని ప్రశ్నించారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడిరచారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్ నిరాకరించినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. నాలుగు స్థానాలు మాత్రం పెండిరగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. పెద్దగా మార్పులేవిూ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. నాలుగు చోట్ల కొత్తవారితో పోటీకి దిగుతున్నా మన్నారు. కాగా నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామాల్, అభ్యర్థుల ప్రకటన పెండిరగ్‌లో ఉందన్నా రు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించిన టిక్కెట్ల జాబితాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు దక్కాయి. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మాత్రమే మొండి చేయిచూపారు. కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు.ఎల్లారెడ్డి ` జాజాల సురేందర్ , ఎల్బీ నగర్ `సుధీర్ రెడ్డి, మహేశ్వరం ` సబితా ఇంద్రారెడ్డి, తాండూరు` పైలెట్ రోహిత్‌రెడ్డి , నకిరేకల్ ` చిరుమర్తి లింగయ్య , భూపాలపల్లి ` గండ్ర వెంకటరమణారెడ్డి , పినపాక ` రేగా కాంతారావు , ఇల్లెందు ` హరిప్రియా నాయక్, కొత్తగూడెం `వనమా వెంకటేశ్వర్ రావు ,పాలేరు `కందాల ఉపేందర్‌రెడ్డి ,కొల్లాపూర్ ` హర్షవర్ధన్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరంతా కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌స్‌లోకి వచ్చిన వారే. బోథ్ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్‌ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు మత్రమే.. టిక్కెట్ నిరాకరించారు. అయితే ఆయనకు.. లోక్‌సభ టిక్కెట్ హావిూ ఇచ్చినట్లుగా బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. దీంతో అక్కడ హర్షవర్థన్ రెడ్డికి పోటీ లేదు. ఇక ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి.. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డికి పార్టీలోని ఇతర సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా..తమకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టినా కేసీఆర్ సిట్టింగ్‌లకే ఓకే చెప్పారు. 2018లో అచ్చొచ్చిన ఫార్ములానే కేసీఆర్ రిపీట్ చేస్తుననారు. ప్రజా వ్యతిరేకత, వర్గ విబేధాలు, క్యాడర్‌తో ఇబ్బందులు ఇలా అన్నీ బేరీజు చేసుకున్న తర్వాత సర్వే చేయించగా.. కేసీఆర్ టిక్కెట్లను ఖరారు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్‌ఎస్ గూటికి చేరారు. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిస్తే .. ఒకరి తర్వాత ఒకరు బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరే ముందే వారికి టిక్కెట్ల హావిూ ఇచ్చారు. ఆ హావిూని నిలుపుకునేందుకు టిక్కెట్లను ప్రకటించారు. ఫిరాయింపులు చేసి వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించడం వల్ల పార్టీని నమ్ముకుని ఉన్న వారు అసంతృప్తికి గురవుతారని తెలిసినా… కేసీఆర్.. ముందుకే వెళ్లారు. ఈ కారణంగా కొంత మంది సీనియర్లు పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరుగుతోంది.
సిట్టింగ్‌లందరికీ సీట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్,బోథ్, ఖానాపూర్‌లో అభ్యర్థులను కెసిఆర్ మార్చారు. సిర్పూర్ ` కోనేరు కొనప్ప, ్గªన్నూరు ` బాల్క సుమన్, ్గªల్లంపల్లి ` దుర్గం చిన్నయ్య, మంచిర్యాల` దివాకర్ రావు, ఆదిలాబాద్ `జోగు రామన్న, బోªరిళిథ్ ` అనిల్ జాదవ్ నిర్మల్`ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి,ముథోల్ `గడ్డెన్నగారి విఠల్ రెడ్డి, ఆసిఫాబాద్` కోవా లక్ష్మి, ఖానాపూర్` జాన్సన్ నాయక్‌లపేర్లు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. వేములవాడలో చెన్నమనేని రమేశ్‌ను మార్చారు. కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బదులు ఆయన కోరకి మేరకు ఆయన కొడుకు డాక్టర్ సంజయ్ కుమార్‌కు టిక్కెట్ ఇచ్చారు. జగిత్యాలలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్,ధర్మపురి`కొప్పుల ఈశ్వర్, మంథని `పుట్ట మధు,పెద్దపల్లి`దాసరి మనోహర్ రెడ్డి, కరీంనగర్ ` గంగుల కమలాకర్, సిరిసిల్ల `కేటీఆర్, చొప్పదండి`సుంకే రవిశంకర్, వేములవాడ` చల్మెడ లక్ష్మీ నరసింహారావు మానకొండూరు ` రసమయి బాలకిషన్,హుస్నాబాద్ ` వొడితెల సతీష్ కుమార్,హుజురాబాద్` పాడి కౌశిక్ రెడ్డి, ªూమగుండం ` కొరుకంటి చందర్ పోటీచేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థుల్లో కూడా మార్పు జరిగింది. దుబ్బాక నుంచి ప్రస్తుత మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. సిద్దిపేట ` తన్నీరు హరీష్ రావు, నారాయణఖేడ్ ` ఎం.భూపాల్ రెడ్డి, ఆందోల్ ` చంటి క్రాంతి కిరణ్, నర్సాపూర్ ` పెండిరగ్‌లో పెట్టారు. సంగారెడ్డి` చింత ప్రభాకర్, పఠాన్ చెరు ` గూడెం మహిపాల్ రెడ్డి, గజ్వేల్ ` కేసీఆర్ పోటీ చేస్తారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అభ్యర్థులకు మ్లలీ టిక్కెట్ ఇచ్చారు. ఉప్ప్ సీటును మాత్రం బేతి సుభాష్ రెడ్డి బదులు మరొకరికి కేటాయించారు. ముషీరాబాద్ ` ముఠా గోపాల్, ఖైరతాబాద్ ` దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ` మాగంటి గోపీనాథ్, సనత్ నగర్ ` తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ` టి పద్మారావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్` లాస్య నందితలు పోటీ చేస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభ్యర్థుల జాబితా ఇలావుంది.దేవరకొండ ` రమావత్ రవీంద్ర కుమార్, నాగార్జునసాగర్ ` భగత్ కుమార్, మిర్యలగూడ ` నల్లమోతు భాస్కర్ రావు, హుజూర్ నగర్ ` శానంపుడి సైదిరెడ్డి, సూర్యాపేట ` జి జగదీష్ రెడ్డి,నల్గొండ ` కంచర్ల భూపాల్ రెడ్డి,భువనగిరి ` పైలా శేఖర్ రెడ్డి,నకిరేకల్ ` చిరుమర్తి లింగయ్య,తుంగతుర్తి ` గాదరి కిషోర్, ఆలేరు ` గొంగడి సునీత, మునుగోడు ` కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు పోటీ చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు పేర్లు ఇలా ఉన్నాయి. స్టేషన్ ఘనపూర్ ` కడియం శ్రీహరి,పాలకుర్తి ` ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ ` రెడ్య నాయక్, మహబూబాబాద్ ` శంకర్ నాయక్, నర్సంపేట ` పెద్ది సుదర్శన్ రెడ్డి పరకాల ` చల్లా ధర్మారెడ్డి, వరంగల్ పశ్చిమ ` దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఈస్ట్ ` నరేందర్, వర్ధన్నపేట ` ఆరూరి రమేష్, భూపాల్ పల్లీ ` గండ్ర వెంకటరమణారెడ్డి,ములుగు ` నాగమణిలను ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. పినపాక ` రేగ కాంతారావు,ఇల్లందు ` బానోత్ హరిప్రియ, ఖమ్మం ` పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు` కందాల ఉపేందర్ రెడ్డి, మధిర `లింగాల కనకరాజు, వైరా` బానోత్ మదన్‌లాల్, కొత్తగూడెం` వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లి ` సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వారావుపేట ` మెచ్చా నాగేశ్వర రావు, భద్రాచలం ` తెల్లాం వెంకట్రావులను ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థుల్లో పేర్లు ఇలావున్నాయి. కొడంగల్ ` పట్నం నరేందర్, నారాయణ్ పేట్ ` ఎస్ రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ` వి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ` సి లక్ష్మారెడ్డి, దేవరకద్ర ` ఆల్ల వెంకటేశ్వర రెడ్డి,మక్తల్ ` చిట్టెం రామ్మోహన్ రెడ్డి, వనపర్తి ` సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్వాల్ ` బండ్ల కృష్ణమోహన్, లలంపూర్` అబ్రహం, నాగర్ కర్నూల్ ` మర్రి జనార్దన్ రెడ్డి, అచ్చంపేట` గువ్వల బాలరాజు, కల్వకుర్తి` జైపాల్ యాదవ్, షాద్‌నగర్` అంజయ్య యాదవ్ కొల్లాపూర్ ` బీరం హర్షవర్థన్ ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ `ఆశన్న గారి జీవన్ రెడ్డి, బోధన్ ` షకీల్ అహ్మద్, జుక్కల్ ` హనుమంత్ షిండే, బాన్సువాడ ` పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ` జాజుల సురేందర్, కామారెడ్డి` కేసీఆర్ నిజామాబాద్ అర్బన్ ` గణెళిష్ గుప్త బిగాల, నిజామాబాద్ రూరల్ ` బాజిరెడ్డి గోవర్ధన్., బాల్కొండ ` వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థుల జావితా ఇఆలావుంది. రాజేంద్రనగర్ ` ప్రకాశ్ గౌడ్, . కుత్బుల్లాపూర్ ` వివేకానంద, శేరిలింగంపల్లి` అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి` మాధవరం కృష్ణారావు. షాద్ నగర్ ` అంజయ్య యాదవ్, కొడంగల్ ` పట్నం నరేందర్ రెడ్డి, మేడ్చల్ ` మల్లారెడ్డి, మల్కాజ్ గిరి` మైనంపల్లి హన్మంతరావులకు కేటాయించారు. ఉప్పల్ మినహా మిగతా అన్ని స్థానాల్లో సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చచారు.