ఏపిలో బిజెపిని బలోపేతం చేస్తాం -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి


విజయవాడ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):దేశ ప్రధాని నరేంద్రమోది, కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని  కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దసరా పర్వదినం సందర్భంగా విజయవాడలో ఆదివారం రాష్ట్ర కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో సునీల్‌ ధియోధర్‌, సుజనా చౌదరి, సోము వీర్రాజు, జీవియల్‌ నరసింహరావు, విష్ణువర్ధన్‌ రెడ్డి, మధుకర్‌ జీ, కన్నా లక్ష్మీనారాయణ, రాం మాధవ్‌, ఆదినారాయణ రెడ్డి, రావెల కిషోర్‌బాబు, గోకరాజు గంగరాజు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నదీ తీరాన, కనకదుర్గమ్మ పాదాల చెంతన దసరా రోజున బిజెపి రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనం చేసుకుని కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం అన్నారు. మోదీ, నడ్డా సారధ్యంలో ఆంధప్రదేశ్‌లో భాజపా బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న  పధకాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు. దేశంలో అత్యధిక మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు ఎక్కువుగా ఉన్న పార్టీ కూడా బిజెపినే అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బిజెపి బలపడుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. పదవుల్లో ఉన్నా లేకున్నా బిజెపి నేతలు కుటుంబంలా కలిసి పార్టీ ని ముందుకు తీసుకెళ్లాలలని కోరారు. ఆంధప్రదేశ్‌ అభివృద్ధి కోసం, ప్రజల  సంక్షేమం కోసం మోదీ సారధ్యంలో పనిచేస్తాం అన్నారు. సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉంటూ నేడు అధ్యక్షులుగా పని చేస్తున్నారని తెలిపారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షులుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఏపీలో బిజెపి బలమైన శక్తిగా, ప్రజా గొంతుకగా రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్‌ షా, తన తరపున ప్రజలందరకీ దసరా
శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో  ప్రజలందరూ ఆయురారోగ్యాలతో  ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ మన రాష్ట్రం విూద ఉన్న అభిమానంతో వచ్చిన కిషన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడం ఖాయం అన్నారు. కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు.