ఏపీఎస్‌జీవోన్‌ అక్రమాలపై కేసు నమోదు చేసిన సీసీఎన్‌ పోలీసులు

హైదరాబాద్‌ : ఏపీఎన్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సీసీఎస్‌ లో కేసు నమోదైంది. ఈ కేసులో 406,409,420 , 182,ఆర్‌/బీ సెక్షన్ల కింద సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి , సెక్రెటరీ చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడు గిరిధర్‌, కోశాధికారి జగన్‌మోహన్‌ రెడ్డితోపాటు, మరో పది హేను మంది డైరెక్టర్లపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీలో 13 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని జాయింట్‌ రిజిస్టార్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ హరిణిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.