ఏపీపీఎన్‌సీ సమాచార అధికారికి జరిమానా

హైదరాబాద్‌:దరఖాస్తుదారులకు సమాచారం నిరాకరించడంతో పాటు సమాచార కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏపీపీఎన్‌సీ సమాచార ఆధికారికి రాష్ట్ర ప్రదాన సమాచార కమిషనర్‌ జరిమానా విదించారు.2007 గ్రూపు 1 పరీక్షకు సంబందించి గుంటూరు జిల్లాకు చెందిన శేఖర్‌బాబు అనే అభ్యర్థి తన సమాదాన పత్రాల్ని ఆర్‌టీఐ ద్వారా అడిగారు.అందుకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిరాకరించడంతో రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.అక్కడ శేఖర్‌బాబుకు ఆనుకూలంగా తీర్పు వచ్చినా దానిని అమలుచేసేందుకు ఏపీపీఎస్‌ నిరాకరించింది.మళ్లీ బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించడంతో ప్రధాన కమిషనర్‌ జన్నత్‌ హుసేన్‌ పీపీఎన్‌సీకి షోకాజు జారీ చేశారు.తిరిగి ఇవాళ జరిగిన ఇవాళ జరిగిన విచారణలో జన్నత్‌ హుస్సేన్‌ తుది తీర్పు వెలువరించారు.పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సమాదానం పై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రదాన కమిషన్‌ ఏపీపీఎన్‌సీ ప్రజా సమాచార అదికారికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.ఇవాళ జరిగిన మరో విచారణలోనూ ఏపీపీఎస్‌సీ పీఐవోకు జరిమానా విధించారు.దరఖాస్తు దారులకు సకాలంలో సమాచారం ఇవ్వడంలో విఫలమవుతున్నందుకే ఈ జరిమానా ఎంత మొత్తం ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.