ఏపీపీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలి
బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్) : ఏపీపీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మను శనివారం దగ్ధం చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో అటలాడుతున్న ఏపీపీఎస్సీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి శరణ్‌కుమార్ కోరారు. అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నేత శ్రీకాంత్ రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి మహేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.