ఏపీలో కూడా కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయి:

వీహెచ్‌

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ జోస్యం చెప్పారు. అవినీతిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఇందుకు కేంద్రంలో, రాష్ట్రంలో కళంకిత మంత్రుల్ని తొలగించడమే నిదర్శనమని వీహెచ్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో అన్నారు. బలహీన వర్గాల ప్రజలంతా ఏకమవుతున్నందున భవిష్యత్‌లో రాజ్యాధికారం బడుగులకే దక్కుతుందని, ఇందుకు కర్ణాటక ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు.