ఏపీ అభివృద్ధికి కేంద్రం అడ్డుకోవటం సరికాదు

మేము పన్నులు చెల్లిస్తున్నాం

మనకు రావాల్సింది ఎందుకు ఇవ్వరు

పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిధుల విడుదల జాప్యం తగదు

కేంద్ర సహకారం లేకున్నా 10.5శాతం వృద్ధిరేటు సాధించాం

కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్‌14(జ‌నం సాక్షి) : కేంద్రంపై తీరుపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి తప్ప అడ్డుకోవటం సరికాదని, పన్నులు చెల్లిస్తున్నా మనకు ఇవ్వాల్సింది.. కేంద్రం ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, విభజన సమస్యలపై గురువారం సచివాలయంలో చంద్రబాబు సవిూక్ష నిర్వహించారు. కేంద్ర సహకారం లేకున్నా 10.5శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. అనేక కష్టాలు, అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతున్నా మూడేళ్ల నుంచి కష్టపడి పనిచేసి రెండంకెల వృద్ధిరేటు సాధించామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు లేకున్నా ఖర్చు చేస్తున్నామని, పోలవరంలో డయాఫ్రం వాల్‌ విజయవంతంగా పూర్తి చేశామని బాబు తెలిపారు. పోలవరం విషయంలో మన వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నిధుల విడుదలలో ఆలస్యం సరికాదని, పోలవరం మన జీవనాడి, ఆంధప్రదేశ్‌ ప్రజల సెంటిమెంటు అని వ్యాఖ్యానించారు. లెక్కలు చెప్పలేదనే నెపం మోపటం సరికాదని, ప్రత్యేక ¬దా కోసం కేంద్రాన్ని గట్టిగా పట్టుబడదామని చెప్పారు. ఇస్తామని చెప్పిన ప్రత్యేక ¬దా ఇచ్చి తీరాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.