ఏపీ సాధించిన వృద్ధిని దేశం దృష్టికి తీసుకొచ్చాం
– రైతుల రాబడి రెట్టింపు అయ్యేలా చర్యలు చేపట్టాలి
– వచ్చే ఏడాదిలోపు తాగునీటి రవాణాకు ఫుల్‌స్టాప్ పెట్టాలి
– మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.830కోట్లు సిద్ధంగా ఉన్నాయి
– మొక్కలు నాటడం, సంరక్షణలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోండి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– నీరు – ప్రగతి, వ్యవసాయంపై టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులతో సీఎం సవిూక్ష
అమరావతి, జూన్18(జనం సాక్షి) : ఏపీ విధానాలు జాతీయ స్థాయిలో ఒక నమూనాగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీతి అయోగ్ భేటీలో ఏపీలో సాధించిన వృద్ధిని దేశం దృష్టికి తెచ్చామని అధికారులకు తెలిపారు. ఏపీలో జలసంరక్షణ, పంట మార్పిడి, పండ్లతోటల వృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. పంటల మద్ధతు ధరలో లోపాలను చర్చనీయాంశం చేశామని అన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకపోవడాన్ని నీతి ఆయోగ్‌లో నిలదీశామని, నరేగాను వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేశామని చెప్పారు. రైతుల రాబడి రెట్టింపు అయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలను సమావేశంలో వివరించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వీటి నిర్వహణలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఏపీ తొలి 3 స్థానాలలో ఉన్నాయని, మొదటిస్థానం పొందేందుకు మరింత సమర్ధంగా కృషిచేయాలని అధికారులకు సూచించారు. నీటి నాణ్యతపై, రక్షిత తాగునీటి సరఫరాపై మరింత దృష్టిపెట్టాలన్నారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా నీటికొరతను అధిగమించాలని తెలిపారు. రెయిన్ గన్ టెక్నాలజీ, జీబా టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచనలు చేశారు. గత ఏడాది కన్నా తాగునీటి రవాణా గ్రామాల సంఖ్య సగానికి తగ్గిందని, తాగునీరు రవాణా చేసిన 500 గ్రామాల్లో ఇంజక్షన్ బోర్ వెల్స్ చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది తాగునీటి రవాణా అనేదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. వాతావరణ సమస్యలను అధిగమించాలని, అప్పుడే సుస్థిర ఆర్ధికాభివృద్ధిని సాధించగలమని తెలిపారు. మద్దతుధర, డిమాండ్‌ను బట్టి పంట మార్పిడిని ప్రోత్సహించాలన్నారు. ఈ నెల 17 రోజుల్లో నరేగాలో రూ.576కోట్ల పనుల లక్ష్యం చేరామని, జూన్‌లో నరేగా రూ.1,000 కోట్ల టార్గెట్ అధిగమించాలని తెలిపారు. ఘన వ్యర్ధాల నిర్వహణ మరింత సమర్ధంగా జరగాలని అన్నారు. ఓడీఎఫ్ తరహాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ పెట్టాలని, షెడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.830కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ల పనులు ముమ్మరం చేయాలని తెలిపారు. మొక్కలు నాటడం, చెట్ల సంరక్షణలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిగ్రామంలో, వార్డులో వృక్షమిత్రలను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయంలో సంక్షోభం అధిగమించామని, గ్రామాలలో ఇన్‌ఫ్రాస్టక్చర్ర్ అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. జనవరికల్లా ప్రజల్లో సంతృప్తి 90?కు చేరుకోవాలని, ఇందుకోసం అధికారులు సమర్ధంగా, సమన్వయంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు