ఏపీ సీఐడీకి మత్తయ్య ఫిర్యాదు..
హైదరాబాద్ : కేసీఆర్, తెలంగాణ పోలీసులపై జెరూసలేం మత్తయ్య ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ‘ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడుగా మత్తయ్య ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కేసును సిట్ కు అప్పగించాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు హాజరయ్యారు. మరోవైపు గవర్నర్ తో తెలంగాణ డీజీపీ భేటీ అయ్యారు.