ఏరోబిక్ సెంటర్‌లో పొన్నాల
హన్మకొండ : ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏరోబిక్ సెంటర్‌లో హల్‌చల్ చేశారు. హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన నటశివ ఏరోబిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి.. పనిలోపనిగా అక్కడే పలు రకాల కసరత్తులు చేసి అకట్టుకున్నారు. స్విస్‌బాల్, స్టెప్పర్, బాడీ కండీషనింగ్ తదితర అధునాతన వ్యాయామాలు చేసి చమటలు కక్కారు. ఏరోబిక్స్ వ్యాయామం నేటి తరం యువతకు ఎంతో ఉపయోగకరమని, వ్యాయామం చేసి అరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి యువతకు సూచించారు.