ఏసీబీకి చిక్కిన ఆసుపత్రి ఉద్యోగి

కరీంనగర్ జనంసాక్షి (ఫిబ్రవరి 8) :

కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మెడికల్ బిల్ నిమిత్తం డబ్బులు ఆశించగా సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఈమేరకు 12 వేల రూపాయల లంచం తీసుకుంటూ… కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేందర్ ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డాడు. కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు రమేష్ అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. ఈ మేరకు ఆసుపత్రిలో లంచం డబ్బు తీసుకుంటుండగా సురేందర్ ను ఏసీబీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ పోలీసులు తెలిపారు.