ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
కరీంనగర్ : లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా నర్సయ్యను అధికారులు పట్టుకున్నారు. బెజ్జంకి మండలం తోటపల్లి పంచాయతీ కార్యదర్శిగా నర్సయ్య పని చేస్తున్నాడు.