ఏసీబీకి చిక్కిన యవాపూర్ వీఆర్‌వో

VRO Devaiah in ACB net

మెదక్ : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు వీఆర్‌వో దేవయ్య. ఓ వ్యక్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా దేవయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తుప్రాన్ మండలం యవాపూర్ వీఆర్‌వోగా దేవయ్య పని చేస్తున్నాడు. దేవయ్య అరెస్టుకు నిరసనగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళనకు దిగిన దళిత సంఘాల నేతలను పోలీసులు చెదరగొట్టారు.