ఏసీబీ ఎదుట హాజరైన మహబూబాద్ ఎమ్మెల్యే
వరంగల్: మద్యం సిండికేట్ వ్యవహారంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ నాగేశ్వర్‌రావు తదితరులను ఏసీబీ ప్రశ్నించింది. హాన్మకొండలోని ఏసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యేను ఏసీబీ డీఎస్పీ మద్యం ముడుపుల వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు.