ఏ తల్లి బిడ్డో…కాల్వగట్టుపై పసికందు..

am2gq6efకరీంనగర్ : కన్నపేగును కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మ మనస్సు రాయి అయింది. సమాజం సిగ్గుపడేలా చేసి అమ్మతనానికి మచ్చతెచ్చారు. పిల్లలు భారమనుకున్నారో..భరించలేమనుకున్నారో ఏమో గాని అభం శుభం తెలియని ఓ పసికందును రోడ్డుపై వదిలేశారు. ఆ పసికందు ఏడుపుకు స్థానికులు స్పందించి అధికారులకు సమాచారం అందించారు. చొప్పదండి మండలం కొలిమికంట కెనాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్వగట్టుపై పసకిందుకు చీమలు పట్టి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో ఐసీడీఎస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. పసికందును ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.