ఏ పదవికీ పోటీ చేయనని కడియం ప్రకటించాలి : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణ కోసమే కడియం శ్రీహరి తెదేపాను వీడితే ఏ పదవికీ పోటీ చేయనని ప్రకటించాలని తెదేపా నేత ఎర్రబెల్లి కోరారు. తెలంగాణకు తెదేపా అనుకూలంగా లేఖ ఇచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైన మాట వాస్తవమేనని తెలిపారు. తెలంగాణపై మహానాడులో ఒకసారి తీర్మానం చేశాక మరోసారి కుదరదని చెప్పారు.