ఏ పార్టీకైనా మేనిఫెస్టోనే మార్గదర్శి

ఆచరించి అమలు చేసే పార్టీ మాత్రం టిఆర్‌ఎస్‌: పువ్వాడ
ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తీసుకవచ్చిన మంచి పథకాలకు రాష్ట్ర ప్రజలకు భరోసా ఏర్పడిందని, తాజాగా మేనిఫెస్టోతో భరోసా దక్కిందని ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఏ పార్టీకైనా మేనిఫెస్టో ముఖ్యమని, అయితే ఇతర పార్టీల్లాగా విస్మరించకుండా అమలు చేయడం కెసిఆర్‌కు మాత్రమే సాధ్యమని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టి పథకాల అమలను చూశారని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకే ఘన విజయాన్ని అందిస్తారని ఆయన పేర్కొన్నారు. రైతులకుఅ ండగా మరోమారు కెసిఆఆర్‌ ప్రకటించిన మద్దతు మరువలేనిదన్నారు. ఆసరా తదితర పెన్షన్ల మొత్తం పెంచడం ద్వారా అభాగ్యుకలు భరోసా కలిగిందన్నారు. అన్‌ఇనంటికి మించి నిరుద్యోగులకు 3వేల పెన్షన్‌ ఇవ్వాలన్న ప్రతిపాదన పెద్ద అసెట్‌ అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలకు దేశవ్యాప్తంగా ఆధరణ లభించిందన్నారు. ఆసరా, మిషన్‌ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌, కేసీఆర్‌ కిట్టు, రైతుబంధు, రైతుబీమా, భూ రికార్డుల ప్రక్షాళన వంటి పథకాలకు మంచి గుర్తింపు లభించిందన్నారు. ఈ పథకాలన్నీ పేద ప్రజల అభ్యున్నతికై కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణతో తీసుకవచ్చారన్నారు. ఈ పథకాలతోప్రతి ఇంటికీ లబ్ధి చేకూరిందన్నారు. ఈ ఎన్నికల్లోనూ సీఎంగా మళ్లీ కేసీఆర్‌నే ఎన్నుకునేందుకు  రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు. ప్రజలకు మేలు చేస్తే ఎన్నటికీ మర్చిపోరనే విషయాన్ని  ప్రజలు రుజువు చేస్తారన్నారు. ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లిన సాధర స్వాగతం పలికి ఆదరణ చూపుతున్నారన్నారు.