ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం

2

– లోక్‌సభలో ఇందర్‌జిత్‌ సింగ్‌

న్యూఢిల్లీ,జులై31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దాపై కేంద్రం మళ్లీ స్పష్టత ఇచ్చింది.  ఏ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వడం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్‌ చెప్పారు. లోక్‌ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయం చెప్పారు. బీహారు కు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం జరిగిందే తప్ప, ప్రత్యేక ¬దా ఇవ్వలేదని ఆయన అన్నారు.దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి విధానం లేదని అన్నారు. ఆర్దిక సంఘం సిఫారస్‌ ల తర్వాత నలభై రెండు శాతం నిదులను రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతోందని ఆయన తెలిపారు.అందువల్ల ఏ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఎపిలో గత కొంతకాలంగా దీనిపై వస్తున్న కదనాలకు తెరదించినట్లు అయింది. అయితే దీనివల్ల బిజెపి, టిడిపిలు తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది.  శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు.  ప్రత్యేక¬దా ఇవ్వడానికి ఎలాంటి నిబంధనలు లేదని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి.