ఐఆర్ డిఏ చైర్మన్ మొండి వైకిరి కారణంగా ఎల్.ఐ.సి ఏజెంట్లు ఆఫీసు ముందు ధర్నా
జగిత్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30
జగిత్యాల పట్టణంలో బ్రాంచి ఆఫీసు లో 1964 అల్ ఇండియా జె ఏ సి పిలుపు మేరకు శుక్రవారం రోజున భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య ఎల్.ఐ.సి కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున ఏజెంట్ల డిమాండ్ల పరిష్కారానికి చేపట్టిన ఆందోళన, నెల రోజుల నుండి ధర్నా చేపట్టారు, ఐ అర్ డి ఏ చైర్పర్సన్ మొండి వైఖరి కారణంగా, మా డిమాండ్లు… పాలిసి దారుల పై బోనస్ పెంచాలి, పాలిసి ల పై జిఎస్టీ ని రద్దు చేయాలి,ఏజెంట్ల కు కమిషన్ 2013,2016 ఐ ఆర్ డి ఏ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పెంచాలి,5 నూతన సంవత్సరాల పై బడి బకాయి బడిన పాలిసీలు ల్యాప్స్ పునరుద్ధరించేకునే అవకాశం కల్పించాలి, ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలి,ఏజెంట్లు గాని పాలిసిదారులు గాని ఆఫీసు లో ఇచ్చే ప్రతి కాగితానికి డ్యాకుమెంట్ రసీదు ఇవ్వాలి,క్లియ ఏజెంట్ల కు సదుపాయాలు పెంచాలి,అందరి ఏజెంట్ల కు గ్రూప్ మెడి క్లెయిమ్ వర్తింపజేయాలి,గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి,భారత ప్రభుత్వం ఏజెంట్ల కు ప్రొపెషనల్ గా గుర్తింపు చేయాలి,0% వడ్డీతో క్లబ్ ఏజెంట్ల కు హౌసింగ్ లోన్ ఇవ్వాలి, సిటిజన్ చార్టర్ లోకల్ భాషలో మదించి బ్రాంచి ఆఫీసు లో ప్రదర్శించాలి, పాలిసి బాండ్లు పోస్టల్ వారు ప్రింట్ చేసి పంపించే విధానం అపి పాత పద్ధతి ని కొనసాగించాలి,బ్రాంచి మరియు డివిజన్ ఆఫీసు లలో సర్విసింగ్ విధానం మెరుగు పరచాలి,ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలి,కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్,కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రవేశ పెట్టాలి,, లియాఫీ బ్రాంచి అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ
ఎల్.ఐ.సి పైన ప్రజలకు అపార నమ్మకం,
ప్రజలకు అనువైన ఎన్నో పాలసీలు చెప్పి, చైతన్యం కలిగించి కుటుంబాలకు భరోసా కల్పించేది ఏజెంట్లు మాత్రమే నని 13 లక్షల కుటుంబాలు పరోక్షం గా
2 లక్షల కుటుంబాలు, ప్రత్యక్షం గా ఆధారపడి ఉన్నాయి అని అన్నారు,సామాన్య ఏజెంట్ల ను మాత్రం ఇబ్బందికి గురి చేయటం బాధాకరం అని అన్నారు. ధర్నా లో పాల్గొన్న వారిలో బ్రాంచి అధ్యక్షుడు ఏనుగుర్తి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి పాదం ఐలయ్య, కోశాధికారి జున్ను మల్లయ్య, ఉపాధ్యక్షులు ఐలేని రాజేశ్వర్ రెడ్డి, చెన్నూరి గంగాధర్, ముమ్మడి సురేందర్, దూడం శ్రీశైలం, గుండారపు రవీందర్, బొడ్ల వీరశం, గుండ నాగరాజు,మొటం శ్రీనివాస్, ఆలూరి సత్యం,పిన్నoశేట్టి మధుసూదన్,చెట్టె మల్లేశ్, కార్యవర్గ సభ్యులు, 400 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.