ఐఎస్‌ఐఎస్ చెరవీడిన బందీలు
– కుటుంబసభ్యుల హర్షం
న్యూఢిల్లీ,ఆగస్ట్ 5(జనంసాక్షి):
లిబియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు ఫ్రొఫెసర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. వారిని అక్కడి భారత దౌత్య కార్యాలయానికి తరలించారు. తెలుగు ఫ్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను విడుదల చేసినట్లు విదేశాంగశాఖ ద్వారా సమాచారం అందిందని ఆయన చెప్పారు. త్వరలోనే ఇద్దరి తెలుగువారిని భారత్‌కు తీసుకువస్తామని తెలిపారు. ఈ ప్రొఫెసర్ల విడుదల సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు తమ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.లిబియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చెరలో ఉన్న తెలుగువారు క్షేమంగా ఉన్నట్లు అంతకుముందు కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు. ఉగ్రవాదుల ఇద్దరు తెలుగువారిని విడిచిపెట్టినట్లు విదేశాంగ అధికారులు నుంచి సమాచారం అందించినట్లు ఆయన విూడియాకు వెల్లడించారు. చెరలో ఉన్నవారి విడుదల విషయంపై ఎప్పటికప్పుడు విదేశాంగ అధికారులతో సంప్రదిస్తూనే ఉన్నామని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.