ఐఎస్‌ఐ ఏజెంట్‌ రంజిత్‌ సింగ్‌ అరెస్టు

2

– నిందితుడు ఏయిర్‌ఫోర్స్‌ మాజీ అధికారి

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):  పాకిస్థాన్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీకి గూఢచర్యం చేస్తున్న భారత ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధికారిని పంజాబ్‌లో అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు రంజిత్‌సింగ్‌ అనే మాజీ అధికారి సమాచారం అందిస్తున్నాడని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజిత్‌ సింగ్‌ గతంలో భారత వైమానిక దళంలో పనిచేస్తూ సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌ అయిన తర్వాత అతడు ఐఎస్‌ఐకు గూఢచర్యం చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు రక్షణ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. అతడి చర్యలపై నిఘా పెట్టారు. పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు. అతడి చర్యలపై అనుమానంతో ఇప్పుడు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.