ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్‌ రుణసాయం రూ. 870 కోట్లు

హైదరాబాద్‌ : ఐఐటీ చరిత్రలో తొలిసారిగా భారీ మొత్తంలో విదేశీ నిధుల సాయంతో ఐఐటీ హైదరాబాద్‌ రూపుదిద్దుకోనుంది. జపాన్‌ అందించే 174.8 మిలియన్‌ డాలర్ల(దాదాపు 870 కోట్లు) అర్థిక సాయంతో 9 భారీ భవనాలు నిర్మించనున్నారు. టెక్నాలజీ సెంటర్‌, రిసెర్చ్‌ పార్కు లాంటిని ఏర్పాటుచేయనున్నారు. విద్యార్థుల సంఖ్యను కూడా ప్రస్తుతమున్న వెయ్యి నుంచి 2018 నాటికి 7,500 మందికి క్రమంగా పెంచనున్నారు. బోధనాసిబ్బంది సంఖ్య కూడా వంద నుంచి 750కి పెరుగుతుంది.