ఐకేపీ సిబ్బంది దీక్షలు ప్రారంభం
ఖమ్మం సంక్షేమం : జిల్లా ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద దీక్షలను ప్రారంభించారు. 12వ రోజు దీక్షలను జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్ ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.