ఐక్యసంఘాల నేతల అరెస్టు
కాశీపేట గ్రామీణం: మందమర్రి ప్రాంతంలో నిర్మించే కల్యాణిఖని ఉపరితల గనిని నిలిపివేయాలంటూ మందమర్రి జీఎం కార్యాలయం ముట్టడికి కాశీపేట నుంచి బయలుదేరిన ఐక్య సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ప్రజాఫ్రంట్ రాష్ట్ర నేతలు నల్మాన్ కృష్ణ, ఇబ్రహీం తదితరులు ఉన్నారు.