ఐటీ చట్టం దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గదర్శకాలు
ఢిల్లీ: ఐటీ చట్టంలోని 66(ఎ) నిబంధన దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గ దర్శకాలు జారీ చేసింది.ఐటీ చట్టంలోని ఈ నిబంధన కింద అరెస్టు చేయాలంటే డీసీపీ లేదా ఐజీ అనుమతి తప్పనిసరి చేసింది. ఐటీ చట్టం సవరించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆన్‌లైన్‌లో అభ్యంతరకర సందేశాలకు సంబంధించి కోర్టు అనుమతితోనే అరెస్టులు చేయాలని ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం కోరుతోంది.