ఐదవ రోజుకు చేరిన పొన్నం ప్రభాకర్ పాదయాత్ర
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజు శనవారం చొప్పదండి నియోజకవర్గం బోయిన్ పల్లి లో సాగింది .ఆయనతోపాటు చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం ఉన్నారు. ఈపాదయాత్ర బోయినిపల్లి మండలం కొదురుపాక మీదుగా నీలోజిపల్లి గ్రామానికి శుక్రవారం సాయంత్రం చేరుకుంది . అక్కడే వారు బస చేశారు. ఉదయం మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రావు పల్లి లో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుస రవీందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . అనంతరం చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు రైతులకు బిసి ఎస్సి ఎస్టి మైనార్టీ వర్గాలకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అని అన్నారు. అనంతరం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యవసర సరుకుల నుంచి పెట్రోల్ డీజిల్ వంటగాస్ ధరలు విపరీతంగా పెంచూ ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయని అన్నారు ముంపు గ్రామాలలో చదువుకున్న యువత కు ఉపాధి లేక ఉపాధి హామీ కూలీలుగా హమాలి కూలీలుగా ఆటో డ్రైవర్ లు గా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొదురుపాక లో నిర్వహించిన ముంపు గ్రామాల ఐక్యవేదిక మీద ముంపు గ్రామాల ప్రజలకు ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ముంపు గ్రామాల ప్రజలను మోసం చేశాడని అన్నారు. ప్రజల సమస్యలు తీర్చకుండా ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు . రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జి మహేశ్వర్రెడ్డి , ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఎం డి బాబు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగుల వంశీ , బీసీ సెల్ మండల అధ్యక్షుడు హరికృష్ణ , మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతిగౌడ్ , నాయకులు ఎల్లేష్ , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు