ఐదు మాసాల్లో 102 శాతం బొగ్గు ఉత్పత్తి

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 30 (జనం సాక్షి):మణుగూరు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏరియా ప్రధాన అధికారి జి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో తరచుగా వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి కొంచెం ఆటంకం కలిగినప్పట్టికి 01 ఏప్రిల్ నుంచి 30 సెప్టెంబర్ వరకు అయిదు నెలల కాలంలో 102 శాతం ఉత్పత్తి సాధించింది.2022 సెప్టెంబర్ మాసంలో మణుగూరు ఏరియా సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు ఈ సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 877000 టన్నులు కాగా 1056117 టన్నులు అనగా 120 శాతం ఉత్పత్తి. సాధించింది.ఓ బి వెలికితీత లక్ష్యం 14 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా 10.49 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 75 శాతం చేయడం జరిగింది. రైల్వే ర్యాక్స్ ద్వారా 154 ర్యాక్స్ బొగ్గు రవాణా చేశాము. సెప్టెంబర్ నెలలో రైల్వే, రోడ్ అండ్ రోప్ వే ద్వారా మొత్తం రవాణా 10 లక్షల 51 వేల 737 టన్నులు బొగ్గు రవాణా చెయ్యడం జరిగింది.2021-22లో సింగరేణి మొత్తం టర్నోవర్ రూ. 26,607 కోట్లుగాను నికర లాభాలు రూ.1,227 కోట్లు. ఆర్జించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 30 శాతం లాభాల బోనస్ గా గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటాను దసరా కానుకగా రూ. 368 కోట్లను దాదాపు 44. వేల మంది ఉద్యోగులకు అక్టోబర్ 1వ తేదీన (శనివారం) చెల్లించనున్నట్లు ప్రకటించారు. అందుకు సింగరేణి ఉద్యోగులు. అధికారులు మరియు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపినారని జనరల్ మేనేజర్ జి. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. సింగరేణి ఉద్యోగులు అధికారులు, యూనియన్ నాయకులతో కలిసి సమిష్టిగా పని చేసి సంస్థ అభివృద్ధికి సహకరించాలి తద్వారా ప్రత్యక్షంగా అనేక మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాల్లో రావడంతో పాటు పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాది అవకాశాలు దొరుకుతాయని సూచిస్తూ ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ రిపోర్టర్స్ వారు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాంసిబిలిటీ క్రింద రూ. 1 కోటి 50 లక్షలు మణుగూరు ఏరియాలో మూడు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం యాజమాన్యం మంజూరు చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి లలిత్ కుమార్ , ఏరియా ఇంజినీర్ ఫిట్జ్ గెరాల్డ్ , ఏటిఎం (సివిల్) వెంకటేశ్వర్లు , పీఓ పీకేఓసీ లక్ష్మీపతి గౌడ్ , పీఓ ఎంఎన్ఐఓసి శ్రీనివాస చారి, డిజిఎం (ఐఈడి) కె వెంకట్ రావు , డిజిఎం (ఈ&.ఎం) సర్వే రెడ్డి , డిజిఎం (పర్సనల్) ఎస్ రమేశ్ , ఫినాన్స్ మేనేజర్ అనురాధా, సీనియర్ పర్సనల్ అధికారులు, సింగు శ్రీనివాస్, వి రామేశ్వర రావు, సీనియర్ ఎస్టేట్స్ అధికారి ఉషా శ్రీ , సంక్షేమ అధికారి డి నరేశ్ , పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.