ఐదో విడత పల్లె ప్రగతిలో పాల్గొన్న ఎంపీపీ*

మునగాల, జూన్ 14(జనంసాక్షి): ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని కలకోవ గ్రామంలో మునగాల మండల ఎంపిపి ఎలక బిందు నరేందర్ రెడ్డి మంగళవారం పాల్గొని గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను వారు పరిశీలించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, ఉపాధి హామీ పనులు,పాఠశాలల్లో రికార్డుల పరిశీలన చేసి మధ్యాహ్న భోజన పథకం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఇంటి చుట్టు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని వారు సూచించారు. ఇంట్లో నీటి నిల్వలు ఉంచకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైడ్ కాలవలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు, ఎంపీటీసీ, సెక్రెటరీ, గ్రామప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.