ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్
హైదరాబాద్ జనంసాక్షి : ఇండియన్ ప్రీమియర్ లీగ్-8(ఐపీఎల్-8) తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నారు. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. మొత్తం 47రోజులపాటు 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది పూణె, చెన్నైలలో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.