ఐరాతో చిందేసిన కోహ్లీ
స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత మంచి డాన్సరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ సీజన్ లో రాయ్ ఛాలెంజర్స్ బెంగళూర్ తరపున తన టీం సభ్యులతో జరుపుకున్న పార్టీల్లో క్రిస్ గేల్ తో కలిసి చిందులేయటం చూశాం. అంతేకాదు టీమిండియా వేడుకల్లో, చివరకు యువీ, భజ్జీ పెళ్లి వేడుకల్లోనూ స్టెప్పులేశాడు కూడా.
ఇక ఇప్పుడు ఓ క్రికెట్ కూతురితో కలిసి చేసిన డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రెండేళ్ల కూతురు అరియాతో కలిసి లోబెగా హిట్ సాంగ్ ఐ గాట్ ఏ గర్ల్ పాటకు డాన్స్ చేశాడు. టీమిండియాపై 3-0 తేడాతో సిరీస్ గెలిచిన సందర్భంగా ఇలా అరియా-కోహ్లీలు చిందులేశారంటూ మహ్మద్ షమీ ఆ వీడియోను పోస్ట్ చేశాడు.
ఇక వీళ్ల వీడియో చాలా క్యూట్ గా ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. పోస్ట్ చేసిన కాసేపటికే వీడియోకు 9,000 లైకులు రావటం విశేషం.