ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మరియు వి.వి.ఎచ్.ఎస్ పాఠశాల నందు గల ఐలమ్మ విగ్రహాన్నికి పూలమాలలు వేసి ఘనంగా నివ్వాలర్పించారు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ భూమి కొసం, భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజకారులను, భూస్వాములును ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.తొలి భూ పోరాటానికి సామాజిక న్యాయానికి నాంది పలికిన ధైర్య శైలి, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు.నేటి తరానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపు నిచ్చారు. బలహీన వర్గాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట.నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ., బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక .నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయి.భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయి. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వ ముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమన్నారు. హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తుందన్నారు.ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్న కేసీఆర్ సర్కారు.తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్ర‌పంచానికి చాటిని నిప్పుక‌ణిక‌, వీర‌నారి చాక‌లి ఐల‌మ్మఅని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కౌన్సిలర్ లు ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area