ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతాలు

అశ్వరావుపేట, సెప్టెంబర్ 13( జనం సాక్షి )

 

అశ్వారావుపేట మండలంలోని అంగన్వాడి కేంద్రాలలో తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలో 30 రోజులు పోషణ మాసా వారోత్సవాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామపంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రం 1లో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేసి పసుపు కుంకుమ అందజేశారు. మరియు ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా
అంగన్వాడి సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ తో పాటు స్థానికులచే ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషాన్నిచ్చిందని, అన్నారు
గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తప్పకుండా. తీసుకోవాలని, తల్లి పాలును మించిన ఆహారం మరొకటి లేదని, తల్లి పాల వల్ల పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్క తల్లి మూర్రిపాలు పట్టించాలని ఆమె అన్నారు. స్థానిక సర్పంచ్ సాదు జోష్నాబాయి మాట్లాడుతూ తల్లి పిల్లలు క్షేమం కోరుతూ నిరంతరం వారికోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కు ధన్యవాదములు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమం లో చిన్నారులను అలరించే విధంగా కూరగాయలతో తయారుచేసిన కొన్ని జీవప్రాణి బొమ్మలు సైతం ఆకట్టుకున్నాయని వాటిని చూస్తే పిల్లలపై టీచర్స్ కి ఉన్న అంకిత భావం గొప్పదని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అంగన్వాడీ టీచర్ కేదారేశ్వరి అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.