ఐసిసి ర్యాంకింగ్స్‌లో సచిన్‌కు 11వ స్థానం
ముంబయి, జూన్ 27 : ఐసిసి ర్యాంకింగ్స్‌లో సచిన్ టెండుల్కర్ 11వ స్థానం సంపాదించారు. ఆ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. టెండుల్కర్‌కు 749 పాయింట్లు దక్కాయి. టాప్ 20 జాబితాలో ఈయన ఒక్కరే భారతీయుడు. వెస్టిండీస్‌కు చెందిన శివనారాయణ్ చంద్రపాల్‌కు ప్రథమ స్థానం దక్కింది. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కార, గాలెలో మొదటి టెస్ట్‌మ్యాచ్‌లో పాక్‌కు వ్యతిరేకంగా 199 పరుగులు చేసి రెండవ స్థానం దక్కించుకున్నారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే భారత్‌కు చెందిన జహీర్‌ఖాన్‌కు 11వ స్థానం లభించింది. ప్రజ్ఞాన ఓఝాకు 20వ స్థానం లభించింది. దక్షిణాప్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌కు 1వ స్థానం, పాక్‌కు చెందిన సయీద్ అజమల్‌కు 2వ స్థానం ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్‌కు 3వ స్థానం లభ్యమయ్యాయి. ఆల్‌రౌండర్స్ జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన పాకిబ్ అల్ హసన్‌కు అగ్రస్థానం దక్కింది. దక్షిణాఫ్రికాకు చెందిన జేక్స్ కల్లిస్‌కు 2వ స్థానం లభించింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్ అని, ఎవరితో పోల్చలేనన్ని రికార్డులు సాధించినా ఇప్పటికీ గేమ్ పట్ల అనురక్తితో ఉన్నాడని ఆస్ట్రేలియన్ లెజెండ్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ ప్రశంసించారు. సచిన్ చాలా గౌరవనీయమైన వ్యక్తి, అతను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, గేమ్‌పై అతనికి ఉన్న మక్కువ, తపనతో పాటు అసాధారణంగా రాణిస్తుంటడం వంటి అంశాల కారణంగా ఈ స్థానాన్ని అందుకోగలిగారని ఇక్కడి ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌కు 20 ఏళ్లుగా సారధ్యం వహించి వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా లిల్లీ పేర్కొన్నారు. 1980 దశకం చివర్లోఫాస్ట్ బౌలర్‌గా రాణించాలని ఎంఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌కు వచ్చిన సచిన్‌ను తాను నిరాశపర్చడం ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తోందని, అయితే అప్పటి ఎంఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌కు వచ్చిన సచిన్‌ను తాను నిరాశపర్చడం ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తోందని, అయితే అప్పటి తన నిర్ణయం క్రికెట్‌కు గొప్ప మేలు చేసిందని భావిస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ సంఘటనను తాను ఎప్పటికీ మరవలేనని అంటూ, బౌలింగ్ కన్నా బ్యాటింగ్‌పై కేంద్రీకరించమని సలహా ఇచ్చానని, తర్వాత ఏడాది అనంతరం తాను ఇక్కడికి వచ్చానని, అప్పటికి సచిన్‌కు 15 ఏళ్లు ఉంటాయకుకుంటా, నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడని, తొలి బంతినే బౌండరీకి పంపాడని, తర్వాత బంతినీ ఫోర్‌కు పంపాడని, బౌలర్లకు పరుగులు పెట్టిస్తున్నాడని లిల్లీ గుర్తు చేసుకున్నారు. 12 బంతుల్లోనే సుమారుగా 48 రన్స్ చేసి ఇంకా ఆడుతున్నాడని, అప్పుడు తాను ఆ కుర్రాడు ఎవరని హెడ్‌కోచ్ టిఎ శేఖర్‌ను అడగగా అతను నవ్వుతూ, ఇదివరకు పేస్ బౌలర్‌గా శిక్షణ పొందడానికి వస్తే మీరు తిప్పి పంపిన కుర్రాడే ఇతడని చెప్పాడని వెల్లడించారు. ఎంఆర్‌ఎఫ్ పౌండేషన్‌లో శిక్షణ పొందిన భారత పేసర్లలో జహీర్‌ఖాన్ బెస్ట్ అని, తర్వాత ప్రస్తుతం మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ ఉంటారని అన్నారు. ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పిసింగ్, శ్రీశాంత్, ప్రామిసింగ్ అని కొన్ని సార్లు మునాఫ్‌బౌలింగ్ తనకు అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు.